Kankipadu Local News :పునాదిపాడులో నూతన పాఠశాల భవనం ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు.. పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ

Sharat
1 View

కంకిపాడు, జూలై 24 (వార్త): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 27న కంకిపాడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పునాదిపాడులో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు.

పునాదిపాడు గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల–జూనియర్ కళాశాల నూతన భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్న సందర్భంగా కలెక్టర్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి కార్యక్రమ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

మంత్రి పర్యటన విజయవంతం కావాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంత్రి విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి అనుగుణంగా వేదిక, సమావేశ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరిశీలనలో జిల్లా విద్యాశాఖాధికారి సరళ, డిప్యూటీ డీఈవో పద్మారాణి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review