బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం :-రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిన్నగంజాం మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పరిశీలన కోసం మండల స్థాయిలో నూతన ఎలక్షన్ కమిటీ గ్రామాల్లో పర్యటించనుంది.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు చిన్నగంజాం మండల నూతన సమన్వయ ఎలక్షన్ కమిటీ ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ గ్రామ పంచాయతీల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు. ఆయా గ్రామాల్లో పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో గొనసపూడి, చింతగుంపల్లి, కడవకుదురు, మోటుపల్లి, చిన్నగంజాం, కొత్తపాలెం, పెద్దపల్లెపాలెం, రాజుబంగారుపాలెం, మూన్నంవారిపాలెం, నీలాయిపాలెం, పెద్దగంజాం తదితర గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు కమిటీ పర్యటనకు సహకరించాలని పార్టీ వర్గాలు సూచించాయి.
అక్టోబర్ 17న పర్యటన షెడ్యూల్
- మూన్నంవారిపాలెం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు
- పెద్దగంజాం: ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
- రాజుబంగారుపాలెం: మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు
- కొత్తపాలెం: మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- పెద్దపల్లెపాలెం: సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు
- మోటుపల్లి: సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
అక్టోబర్ 18న పర్యటన షెడ్యూల్
- చిన్నగంజాం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు
- కడవకుదురు: ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
- గొనసపూడి: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
- సంతరావూరు: సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు
గ్రామాల వారీగా నిర్ణయించిన సమయాల్లో నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ఎలక్షన్ కమిటీకి సహకరించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటన కీలకంగా మారనుంది.Bapatla District News
— ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చిన్నగంజాం మండల నూతన సమన్వయ ఎలక్షన్ కమిటీ



