దర్శి, సెప్టెంబరు 26:-ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని సందువారిపాలెం రామాలయం దేవస్థానం వద్ద నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద శనివారం టిడిపి యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత సాగర్, દર્శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు అందుకున్నారు.

వీరితో పాటు దర్శి పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు.Prakasam district news :మార్కాపురంలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే మారథాన్
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, ముఖ్య అతిథులను వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈ పూజా మహోత్సవంలో స్థానిక భక్తులు, నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత ఉత్సాహంతో, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



