Krishna District News : వణుకూరులో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజి-డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం

Sharat
2 Views

వణుకూరు (పెనమలూరు), సెప్టెంబరు 22:– పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మంగళవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అవసరమైన పనులకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, వాటి నిర్మాణం ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు.Jaya Krishna Debut: సూపర్‌స్టార్ మనవడి గ్రాండ్ ఎంట్రీ.. ‘శ్రీనివాస మంగాపురం’ గురించి 5 ఆసక్తికర నిజాలు!

అవసరమైన డ్రైనేజీ పనులన్నింటినీ ప్రతిపాదనల్లో పొందుపరచి, వాటిని అనుమతుల కోసం సమర్పించాలని కలెక్టర్ సూచించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రామంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనుల ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ పీవీ రమణారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review