నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెన్నులు గమనించాలన్నారు. లోపాలను గమనిస్తే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మంచి సేవలు అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రజల నుండి అందే ఆర్జీలు సత్వరం పరిష్కరించాలని, వాటిపై శ్రద్ద వహించాలని అన్నారు. రీ సర్వే జరిగే ప్రాంతాల్లో ప్రజల ఇకెవైసి గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలో కచ్చితంగా చేయాలని ఆదేశించారు. పింఛన్లకు కొత్తగా అందిన దరఖాస్తులు తక్షణం విచారణ చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ లో విచారణ చేపట్టాల్సిన నోటీస్ లపై త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలలో ఓటరుగా ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని తెలిపారు. వీబీ జి రామ్ జి పథకం కింద వేతనదారుల సంఖ్య పెంచాలన్నారు. ఈ అంశంలో ఇతర జిల్లాలు మెరుగైన ప్రగతి కనబరుస్తున్నాయని తెలిపారు. మన మిత్రలో వచ్చే దరఖాస్తులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. అన్ని రంగాల్లో జిల్లా మంచి ప్రగతిలో ఉండుటకు ప్రతి శాఖ కృషి చేయాలని అన్నారు. 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాలి*జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించాలన్నారు. “జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం”లో బాగంగా జిల్లాలో గల 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 4,62,714 మంది బాల బాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ , ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో చదివే విద్యార్దిని విద్యార్దులకు, విద్యా సంస్థల బయట ఉన్న వారికి, కౌమార బాల బాలికలకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. దీనిని పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలలో ఓటరుగా ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని తెలిపారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిందేనని చెప్పారు. కృష్ణ – గుంటూరు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ప్రస్తుత హోదా 2027 మార్చి 29వ తేదీన ముగుస్తుందన్నారు. కృష్ణ – గుంటూరు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల నోటిఫికేషన్ ఈ నెల 28వ తేదీన ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమానికి బహిరంగ నోటీస్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, జిల్లా ఎస్.జి.ఎస్.డబ్ల్యూ అధికారి రామలింగేశ్వర రెడ్డి, సమన్వయ అధికారి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
broken clouds
31° _ 31°
70%
2 km/h
Mon
31 °C
Tue
33 °C
Wed
25 °C


