రైల్వేప్రతి సంవత్సరం జూన్ 5 వ తోదీన జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి గుంటూరు డివిజన్, దక్షిణ కోస్తా రైల్వే లో నగర రాజభాషా అమలు సమితి, గుంటూరు యొక్క సదస్య కార్యాలయాల భాగస్వామ్యంలో అద్యక్ష/ నగర రాజభాషా అమలు సమితి మరియు డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీమతి సుధేషనా సేన్ మరియు ఎడిషనల్ డివిజనల్ మండల రైల్వే మేనేజర్ శ్రీ ఏమ్.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ కార్యాక్రమాలు జరిపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డివిజన్లో ఉన్న సంబంధిత విభాగాల అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణనలో ప్రభూత్వ ఉద్యోగుల భాగస్వామ్య ఉద్యమంగా మార్చేందుకు ప్రపధమంగా ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణంలో వచ్చే మార్పులు, నష్టాలు వాటిగురించి తీసుకోవలన జాగ్రత్తలు గురించి అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీమతి సుధేషనా సేన్ గారు ఒకసారి మాత్రమే ఉపయోగించే వస్తువులు అంటే ప్లాస్టిక్ బాటిల్స్, కూల్ డ్రింక్ డబ్బాలు లాంటివి క్రష్ చేసి మరల ఉపయోగించకుండా ఉండే క్రష్ మషీన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే తరం కోసం ఇప్పటి నుండి ప్లాస్టిక్ వాడకాన్ని సాద్యమేనంత వరకు తగ్గించాలి అన్నారు. పరివర్తన నా నుండే ప్రారంభం (I will be the change) అనే నినాదాన్ని అందరిచేత ప్రతిజ్ఞ చేయిపించారు. అధికారులు మరియు ఉద్యోగస్తుల ధ్వారా సంతకాల సేకరణను చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క అధికారి మొక్కలు నాటే కార్యక్రమం లో వారి విభాగల ఉద్యోగులతో కలసి పాల్గొన్నారు. పర్యావరణం-ప్రకృతి పరిరక్షణలో భాగంగా క్విజ్ కార్యక్రమాని నిర్వహించి బహుమతలు అందచేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు ఉద్యోగులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: గుంటూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
heavy intensity rain
30° _ 30°
62%
Thu
38 °C
Fri
34 °C
Sat
36 °C


