కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

City News Telugu

B. Sankar, Desk Incharge | Bapatla: బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు స్వయంగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందజేశారు.

అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అధికారిక రాజముద్రతో రూపొందించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర భూ రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతులకు మరింత భద్రత చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ హరి కుమార్, తహసీల్దార్ సలీమా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review