AP LATEST NEWS: ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగా వాడుకుంటున్నారు

Karthik
6 Views

ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగావాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారంటూ ఆయన మంగళవారం మీడియా ద్వారా మాట్లాడారు. నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా డిస్మిస్ తప్పని ప్రతీ ఐఏఎస్ కు తెలుసు. నన్ను డిస్మిస్ చేసింది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. కానీ, కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడరు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుందే చంద్రబాబు. గతంలో ఏపీ ఉద్యోగులను తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ సమయంలో ఉద్యోగుల చేత ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీలేమయ్యాయి?. ఎప్పుడు అమలు చేస్తారు??.. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేసింది??. ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15వ తేదీ పైనే జీతాలు పడుతున్నాయని ఆయన వెల్లడించారు.

Author
Share This Article
Leave a review