GUNTUR DISTRICT NEWS: ఇ.వి.యం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

Karthik
9 Views

గుంటూరులో గల ఇ.వి.యం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గురువారం తనిఖీ చేశారు. గోడౌన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూంల పరిస్థితి, సీసీటీవీలో పనితీరు, ఇన్వర్టర్ స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం అప్రమత్తంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి, ఆర్ అండ్ బి డిప్యూటీ ఎస్.ఇ, గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review