BSNL : కేవలం ఒక్క రూపాయికే నెలంతా అన్‌లిమిటెడ్ ఆఫర్.. బిఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన!

City News Telugu

గుంటూరు, (ప్రతినిధి):ప్రైవేట్ టెలికాం సంస్థల ధీటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ‘ఫ్రీడమ్ ప్లాన్’ (FRC-1) పేరుతో సరికొత్త ఆఫర్‌ను గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ గారు అధికారికంగా ప్రకటించారు.

ఆఫర్ వివరాలు ఇవే:
కేవలం రూ. 1/- రీఛార్జ్ తోనే 30 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలను పొందవచ్చు.

  • వ్యాలిడిటీ: 30 రోజులు.
  • డేటా: ప్రతిరోజూ 2GB డేటా.
  • కాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కైనా).
  • SMS: రోజుకు 100 సందేశాలు.
  • అదనపు ప్రయోజనం: ఈ ప్లాన్ తీసుకునే వారికి కొత్త సిమ్ కార్డు ఉచితంగా అందించబడుతుంది.

ముఖ్య గమనిక:
ఈ ప్రత్యేక ఆఫర్ ఏప్రిల్ 06 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్తగా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు లేదా ఇతర నెట్‌వర్క్‌ల నుండి బిఎస్ఎన్ఎల్‌కు మారే (MNP) వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ కోరారు

ఆసక్తి గల వినియోగదారులు వెంటనే తమ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలను (CSC) సంప్రదించి ఈ అద్భుతమైన ఆఫర్‌ను సొంతం చేసుకోవాలని వారు సూచించారు.

Total Views: 2
Share This Article
Leave a review