GUNTUR DISTRICT NEWS: ఇంధన అధికారులతో జాయింట్ కలెక్టర్ భేటీ

Karthik

హెచ్.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీల అధికారులతో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం భేటీ అయ్యారు. కొండపల్లి ఇంధన నిల్వల ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఇంధన నిల్వలు అందుబాటు పరిస్థిని ఆరా తీసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దని కోరారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, ఇంధన కంపెనీల అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review