గుంటూరులోని పట్టాభిపురం శాఖ గ్రంధాలయంంలో మంగళవారం వేసవి శిక్షణా తరగతులు ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ పాల్గొన్నారు. వేసవి శిక్షణ తరగతులకు నిర్వహించడానికి ముందుకొచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షణ్ముఖ కోలాటం మాస్టర్, కళ్యాణ్ సంగీతం నేర్పించడానికి, టీ ప్రమీలా దేవి క్రాఫ్ట్ టీచర్, ఎం. జ్యోతి డ్రాయింగ్ టీచర్, ఎస్కే షకీరా బేగం, అజంత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డైరెక్టర్ టి. సుహాసిని ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ఈ వేసవ శిక్షణ తరగతుల యొక్క ఉపయోగాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకొని సెల్ఫోన్ లకి దూరంగా ఉండడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని విద్యార్థులకు వివరించారు. సెలవలను సార్ధకంగా గడపాలనుకునే చిన్నారుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని గ్రంథాలయ అధికారిని పి. సత్యశిరీష తెలియజేశారు.
GUNTUR CITY NEWS: పట్టాభిపురం గ్రంధాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
71%
2 km/h
Sat
34 °C
Sun
37 °C
Mon
38 °C


