గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి మంగళవారం హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శ్రీ లక్ష్మి రఘురామయ్య నగర్ 7వ లైన్, నల్లకుంట హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు, గుంటూరు ప్రాంతంలో నిర్వహించిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి 36వ వార్షికోత్సవ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గారు, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఏటుకూరు హనుమాన్ నగర్ బైపాస్ రోడ్డులో నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఎమ్మెల్యే గారిని సాదరంగా ఆహ్వానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ… ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.



