Amaravati News : ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు గారు అమరావతి చిత్రకళ వీధికి మద్దతు – ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు..
www.AmaravathiArtFestival.com
ఉండి ఎమ్మెల్యే మరియు ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు, అమరావతి చిత్రకళ వీధికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారితో కలిసి, ఈ గొప్ప కళా ఉత్సవాన్ని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ అనేక కళా రూపాలకు నిలయంగా ఉంది. ఇలాంటి వేదికలు కళాకారులను ప్రోత్సహించడానికి ఎంతో అవసరం. మన కళారూపాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అందరం కృషి చేయాలి.” అని అన్నారు.
కళాకారులను ప్రోత్సహించడానికి తన మద్దతుగా స్వయంగా ఒక చిత్రానికి బ్రష్ స్ట్రోక్ వేసి, కళా సమాజానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చిన రఘురామకృష్ణ రాజు గారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, తేజస్వి గారు కళాకారుల సమాజాన్ని బలోపేతం చేసే ఇలాంటి ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వివరించారు.కళాకారులు www.AmaravathiArtFestival.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని ఈ విశిష్టమైన కళా వేడుకలో పాల్గొనవచ్చు.