GUNTUR CITY NEWS: హనుమత్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవి

Karthik

గుంటూరు విద్యానగర్ 1వ లైన్ నందు నిర్వహించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 31వ హనుమాన్ జయంతి మహోత్సవములకు గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అలాగే మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఆలయ ఉత్సవాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కొల్లి అనిల్ కుమార్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review