GUNTUR DISTRICT NEWS: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్ సీ.టీ స్కాన్ ప్రారంభోత్సవం

Karthik

GGHనాట్కో క్యాన్సర్ సెంటర్ లో రూ.18కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్ సీ.టీ స్కాన్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. MPపెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. లీనాక్, పెట్ సీటీ స్కాన్ ఏర్పాటుతో దేశంలోనే మొట్టమొదటి L1క్యాన్సర్ కేర్ సెంటర్ గా రూపాంతరం చెందిందన్నారు. ఈ స్కానర్ ద్వారా క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. 70%క్యాన్సర్లు నివారణసాధ్యపడుతుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలను చేపడుతుందని గుర్తుచేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన కోసం కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. గడిచిన రెండేళ్ళలో GGHలో 140కోట్లతో నూతన అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. జింఖానాలో 27కోట్ల పరికరాల ఏర్పాటుతో రోగులగు మెరుగైన వైద్యసేవలు అందించగలుగుతున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, డేగల ప్రభాకర్, తిరుపతిరావు, గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review