GUNTUR DISTRICT NEWS: వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి

Karthik
Oplus_16908288

వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. వేసవి దృష్ట్యా విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలకు అనుగుణంగా కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. కర్మాగారాలు, దుకాణములలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వేసవి విపత్తుల జాగ్రత్తలు పాటించాలని కోరారు. యాజమాన్యాలు, కార్మికుల పని ప్రదేశాలలో తాగు నీరు, నీడ, వసతి కల్పించాలని, పని ప్రదేశాలలో మజ్జిగ. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు, గర్భిణి స్త్రీలు, వయసు మీరిన కార్మికుల కోసం అధిక జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సహాయం సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. వేసవి తీవ్రత హెచ్చరిక రోజులలో బహిరంగ కార్మికుల పని వేళలను మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు లేకుండా సమయాలను మార్పులు చేయాలని, చల్లని సమయాలకు అంటే ఉదయం మరియు సాయంత్రం వేళలకు మార్పులు చేయాలని సూచించారు. డీ హైడ్రేషన్ నివారణ మార్గాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్మికులకు ప్రతి గంట పని తరువాత 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో ఉష్ణ సూచికపై మండల స్థాయి అంచనాలు మరియు ముందు జాగ్రత్త చర్యలతోపాటు వేడి తరంగాలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు, సమాచారం కోసం పౌరులు 24/7 పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) టోల్-ఫ్రీ నంబర్లు: 1070ని సంప్రదించవచ్చన్నారు. తీవ్రమైన వేడి పరిస్థితులలో రియల్ టైమ్ సమాచారం, అత్యవసర సహాయ సూచనలు అందిస్తాయని చెప్పారు.

Author
Share This Article
Leave a review