త్రాగునీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి కుళాయిలను ఏర్పాటు చేయనందున అడవితక్కేళ్ళపాడుకు చెందిన స్వర్ణ వార్డు ఎమినిటి కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ యస్ఈ ని ఆదేశించారు. సోమవారం పి.జి.ఆర్.యస్ మరియు జియంసి కాల్ సెంటర్ కు వస్తున్నా వివిధ పిర్యాదుల పరిష్కారం పై మరియు కోర్ట్ కేసులకు సంబంధించి నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, నిర్దేశిత గడువు పూర్తైనప్పటికి పిర్యాదులను పరిష్కరించని అధికారులు మరియు సిబ్బంది పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తుందని తెలియచేశారు. పిర్యాదుల పరిష్కారంలో సమస్యలేమైనా ఉంటె ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కాల్ సెంటర్ కు వస్తున్న పిర్యాదుల పరిష్కారంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజల వద్ద నుండి ఎక్కువగా ఏ సమస్య పై పిర్యాదులు అందుతున్నది గుర్తించి, వాటిని పరిష్కరించి, మరలా అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జియంసిలో విభాగాల వారీగా ఉన్న కోర్ట్ కేసుల పై సమీక్షించి, ఫైల్ అయిన కేసులకు సంబంధించి జూన్ 5 కల్లా పార వైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే లోకాయుక్తకు సంబంధించిన కేసులకు కూడా కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టు సమయంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకున్న తరువాత మాత్రమె అభివృద్ధి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జ్) జి. సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, సిటీ ప్లానర్ రాంబాబు, యస్ఈ జి. వెంకటేశ్వర రావు, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: నిర్ధేశిత గడువులోగా ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
64%
6 km/h
Mon
33 °C
Tue
37 °C
Wed
35 °C


