TDP మహానాడు వేదికపై “పేదల సేవలో” అనే కీలక తీర్మానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. పేదల సేవ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతాన్ని నినాదంగా కాకుండా జీవన విధానంగా మార్చుకున్న నేత ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నాయకుల ఆలోచనలే పార్టీకి బలమని పేర్కొన్నారు.పేదలకు సేవ చేయడం మాత్రమే కాదు, సమాజంలో “పేదవాడు” అనే పదమే లేకుండా చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని గళ్ళా మాధవి అన్నారు. విలువలు, త్యాగాలు, సామాజిక బాధ్యతలకు నిలయంగా టీడీపీ నిలిచిందని చెప్పారు.ప్రజల సాధికారత, తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ దిశగా పార్టీ నాయకత్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు.



