ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాల్ లను తయారు చేశారు. మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వలన కాలుష్యకోరాల నుంచి బయటపడవచ్చు అని, ఎండ వేడిమి నుండి తప్పించుకోవచ్చని అన్నారు. పర్యావరణం పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వీకరించాలని కోరారు. కాలుష్యం నుండి బయట పడుటకు, భావి తరాలకు మంచి వాతావరణం అందించుటకు పచ్చదనం అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ వాడకం నియంత్రిద్దామని పిలుపునిచ్చారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లవద్దని, ఆరోగ్య సంరక్షణ అవసరమని సూచించారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరిద్ధామని కోరారు. గుంటూరు జిల్లాను పచ్చదనం జిల్లాగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ మాట్లాడుతూ సీడ్ బాల్ లను తయారు చేసి తద్వారా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెరుగుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం మాట్లాడుతూ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుటకు లక్ష మొక్కలు నాటాలని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ కూల్ గుంటూరు పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, సి.ఎస్.ఆర్ ఆర్గానిక్స్ నిర్వాహకులు మొక్కల సీతారామయ్య, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: మొక్కలు నాటుదాం… పచ్చదనాన్ని కాపాడుదాం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
overcast clouds
31° _ 31°
61%
2 km/h
Sat
40 °C
Sun
42 °C
Mon
40 °C


