GUNTUR DISTRICT NEWS: ఆరుగురు బాల కార్మికులకు విముక్తి

Karthik

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్ మరియు చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ వారు ఈరోజు మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్ ల నందు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరుగురు బాల కార్మికులను గుర్తించారు, వాళ్ళను స్కూల్ కు వెళ్ళే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు యజమానులపై కేసులు నమోదు చేశారు. బాల కార్మికులు ఎక్కడైనా ఉన్న యెడల వెంటనే ఈ నెంబర్లకు 1098, 9492555157 సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రి దేవి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి మరియు చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ వారు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review