గుంటూరులోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం వైఎస్ఆర్సిపి నగర,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుల మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేంద్ర, నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ మాట్లాడారు.టిడిపి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు జగన్ను విమర్శించే స్థాయి కాదని ధ్వజమెత్తారు. కార్పొరేటర్ గా పోటీ చేయని పిల్లి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. డీఎస్సీలో ఉద్యోగాలలో జరిగిన ఒక అవకతవకలపై మంత్రి లేదా ఆ శాఖ కార్యదర్శి మాట్లాడాలి గాని పిల్లికి ఏం పని అని మండిపడ్డారు. పిల్లి నోరు అదుపులో పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. లిడ్ క్యాప్ చైర్మన్ గా ఏ ఒక్క పని చెయ్యని నువ్వు ఇకనైనా నీ పదవికి న్యాయం చెయ్యి.నీ పుట్టినరోజుకు ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు నీ స్ధాయి ఏంటో గుర్తుపెట్టుకో.అబద్దం పుట్టిందే చంద్రబాబు నాయుడు దగ్గర.తన తల్లిదండ్రులకు ఒక్కపూట కూడా కడుపునింపని గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం లో ప్రతిఒక్కరి కష్టాలను తెలుసుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.చెప్పిన ప్రకారం నవరత్నాలను అమలు చేసిన నాయకులు జగన్ మోహన్ రెడ్డి. మెగా డియస్సీ పేరుతో కోట్లు దోచుకున్నారు.సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. విద్యార్థి దశనుంచి అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉన్నారు.ఒక నిబద్దతతో అంబటి రాంబాబు పనిచేస్తున్నారు.కూటమి పాలనపై బహిరంగ చర్చకు మేము సిద్దంగా ఉన్నాము. మీరు సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు.
GUNTUR DISTRICT NEWS: దమ్ముంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
overcast clouds
30° _ 30°
55%
2 km/h
Mon
41 °C
Tue
42 °C
Wed
43 °C


