GUNTUR DISTRICT NEWS: సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరిస్తేనే అర్జీదారులు సంతృప్తి చెందుతారు: కలెక్టర్

Karthik

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరిస్తేనే అర్జీదారులు సంతృప్తి చెందుతారని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సూచించారు.సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,  జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డిప్యుటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, గంగరాజు అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. వివిధ రకాల సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిశీలించి పరిష్కరిస్తేనే అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం చూపకుండానే అర్జీలను మూసివేసే అధికారులపై చర్యలు తప్పవన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వద్దకు ఎప్పటివలెనే జిల్లా కలెక్టర్ నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొంతమంది దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ వీల్ చైర్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review