మాచర్ల జూన్ 19:– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా, మాచర్ల పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ సభ జనసంద్రోహమై దద్దరిల్లింది. ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరిట శుక్రవారం స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్, మెయిన్ రోడ్డులో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ముందుగా వెల్దుర్తి నుండి వేలాది ద్విచక్ర వాహనాలు, వందలాది ట్రాక్టర్లు, కార్లలో కూటమి శ్రేణులు భారీ కాన్వాయ్‌తో తరలివచ్చారు. స్థానిక శ్రీశైలం రోడ్డులోని పెద్దాంజనేయస్వామి వారి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి వారికి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ… ఇసుకేస్తే రాలనంత జనసందోహం నడుమ సుమారు ఒక కిలోమీటర్ మేర సాగింది. పసుపు, ఎరుపు, కాషాయ జెండాల రెపరెపలు, డీజే మోతలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నృత్యాలతో పట్టణ పురవీధులు మారుమోగాయి.
- మాచర్ల జూన్ 19:– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా, మాచర్ల పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ సభ జనసంద్రోహమై దద్దరిల్లింది. ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరిట శుక్రవారం స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్, మెయిన్ రోడ్డులో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించారు.
- బెబ్బులి పులి బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
- తండ్రికి తగ్గ తనయుడు జేబీఆర్: ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు
- పిన్నెల్లి పిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
- పసుపు హిట్టుతో కాక్రోచులను తరిమికొడతాం: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
నాలుగు గంటల పాటు సాగిన ఈ భారీ ర్యాలీలో కూటమి పార్టీల శ్రేణులు నాయకులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రింగ్ రోడ్డు సెంటర్, నాగార్జున కళామందిరం మీదుగా ర్యాలీ శ్రీనివాస మహల్ సెంటర్ వద్దనున్న సభా వేదికకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల త్రిమూర్తుల జోడీతో రాష్ట్రంలోని అన్ని రంగాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయని నేతలు కొనియాడారు.

బెబ్బులి పులి బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
“గత వైసీపీ అరాచక శక్తులపై ధైర్యంగా తిరగబడి, మాచర్ల ప్రజలను రక్షించిన బెబ్బులి పులి జూలకంటి బ్రహ్మానందరెడ్డి (జేబీఆర్). అందుకే ఈరోజు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.” – జీవీ ఆంజనేయులు, వినుకొండ ఎమ్మెల్యే & ప్రభుత్వ చీఫ్ విప్
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం విజయపథంలో దూసుకుపోతున్నాయని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, రాష్ట్రానికి తరలివస్తున్న పెట్టుబడులను చూసే ప్రజలు ఇంతలా విజయోత్సవ ర్యాలీలకు తరలివస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యాలపై గళమెత్తి, ప్రజల్లో చైతన్యం తెచ్చి, ప్రజా విజయంతో నియోజకవర్గాన్ని బ్రహ్మారెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని గుర్తుచేశారు.
తండ్రికి తగ్గ తనయుడు జేబీఆర్: ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు
మాజీ శాసనసభ్యులు, దివంగత జూలకంటి నాగిరెడ్డికి తగ్గ తనయుడు కూటమి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రశంసించారు. పిన్నెల్లి సైకో సైన్యంపై యుద్ధం చేసి మరీ తెలుగుదేశం పార్టీని గెలిపించిన మాచర్ల ప్రజలకు, జూలకంటి నేడు ప్రశాంత జీవనాన్ని అందిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కుప్పంతో సమానంగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎవరికైనా సీటు ఉంటుందో లేదో తెలియదు కానీ, మాచర్ల నియోజకవర్గానికి మాత్రం ఎప్పటికీ బ్రహ్మారెడ్డే ఎమ్మెల్యేగా ఉంటారని ఆయన జ్యోష్యం చెప్పారు.
పిన్నెల్లి పిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిచ్చి పరాకాష్టకు చేరిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ పిన్నెల్లి సోదరులకు మదం తగ్గలేదని మండిపడ్డారు. గతంలో ప్రజలను చిత్రహింసలు పెట్టి, రాజకీయ పబ్బం గడుపుకున్న నీచులకు ప్రజాస్వామ్యం విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు. ప్రజల మనిషిగా బ్రహ్మారెడ్డి మాచర్లను అభివృద్ధి వైపు నడిపిస్తున్న తీరు ఎంతో ప్రశంసనీయమన్నారు.

పసుపు హిట్టుతో కాక్రోచులను తరిమికొడతాం: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
తమను తాము పులులుగా చెప్పుకునే జగన్ రెడ్డి అండ్ కో.. నేడు ‘కాక్రోచ్’ (బొద్దింకల) మాదిరిగా తయారయ్యారని, ‘పసుపు హిట్’ కొట్టి మరీ వారిని రాష్ట్రం నుండి తరిమికొడతామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు.
గడిచిన రెండేళ్ల అభివృద్ధి-సంక్షేమ గణాంకాలు:
- అభివృద్ధి పనులు: రూ. 1,732 కోట్లు
- సంక్షేమ పథకాలు: రూ. 650 కోట్లు
గడిచిన రెండేళ్ల పాలనలో ఇంతటి భారీ నిధులతో ప్రజలకు సేవ చేశామని చెప్పడానికి గర్వపడుతున్నానని జేబీఆర్ అన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి మోసపూరిత లెక్కలు చూపించడం పిన్నెల్లి నైజమని మండిపడ్డారు.
వారికపూడిశెల ప్రాజెక్టుపై స్పష్టత: వారికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా కట్టుబడి ఉన్నారని.. ఇప్పటికే ఫారెస్ట్ క్లియరెన్స్, భూసేకరణ కోసం రూ. 78 కోట్ల నిధులను విడుదల చేశారని గుర్తుచేశారు. “వారికపూడిశెల నిర్మించుకుంటే పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆనాడే చెప్పాను.. ఈ ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేసి తీరుతాం” అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పిన్నెల్లి, సిగ్గులేకుండా ఇంకా రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. తనకు రాజకీయ జీవితం కంటే ప్రజాసేవే ముఖ్యమని, ప్రజా శ్రేయస్సు కోసమే తన జీవితం అంకితమని జూలకంటి స్పష్టం చేశారు.
ఈ మహా విజయోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది ప్రజలు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



