GUNTUR DISTRICT NEWS: ఇంధన కొరతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన

Karthik

జిల్లాలో ఇంధన కొరతను తీర్చాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈమేరకు గ్రీవెన్స్ లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యన్నం సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశామని. ఈ కొరత వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో అనేక పెట్రోల్ బంకులు “నో స్టాక్” బోర్డులతో కనిపిస్తుండగా, తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని అన్నారు, డీజిల్ అందుబాటులో లేక రైతులు వ్యవసాయ పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, విద్యాసంస్థల వాహనాలు వంటి అత్యవసర సేవలు కూడా ప్రభావితమవుతున్నాయని కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు ఇంధనం విక్రయించడం జరుగుతుందని సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే నిత్యావసర వస్తువుల సేవలు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.‌‌ ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకుని చమురు సంస్థలతో పౌరసరఫరా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు, జిల్లాకు అవసరమైన ఇంధన సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, పెట్రోల్ బంకుల వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి క్రమబద్ధమైన పంపిణీ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ప్రజల్లో ఉన్న అపోహలను నివారించాలని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో చంద్రపాల్, లీగల్ సెల్ కృష్ణ, జాఫర్, పాకనాటి నరేష్, బ్రహ్మం పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review