చేబ్రోలులో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. సంఘటన తీవ్రతరం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అన్ని మందులు సిద్ధంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితులు చేయి దాటరాదు. ప్రస్తుతానికి పరిస్థితులు పూర్తి అదుపులో ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి వర్సెస్ ప్యాకెట్లు తాగు నీరు సరఫరా చేయాలి. అస్వస్థత గల కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. అస్వస్థత గురైన వారు ఎటువంటి ఆందోళనకు గురికారాదు. మంచి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అందరు వైద్యులు, అధికారులు అందుబాటులో ఉన్నారని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.



