గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పూర్తి అయిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బృందావన్ గార్డెన్స్, కెవిపి కాలనీ, కొరెటేపాడు శ్మశానవాటిక తదితర ప్రాంతాలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా క్లియర్ గా ఉన్న పోర్షన్స్ ల్లో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కోర్ట్ కేసులు దాఖలు చేసిన భవనాల యజమానులతో పట్టణ ప్రణాళిక అధికారులు మరొకమారు చర్చించి, నిర్దేశిత మార్గదర్శకాల మేరకు తోడ్పాటు అందిస్తామని, కీలకమైన రహదారి కనుక విస్తరణ వేగావంతానికి సహకరించాలని తెలియచేయాలన్నారు. స్తంభాల గరువు రిజర్వాయర్ కి కాంపౌండ్ వాల్ నిర్మాణం, జిఎంసి సర్కిల్ ఆఫీస్ మరమత్తు పనులను తక్షణం చేపట్టాలని డిఈఈ, ఏఈలను ఆదేశించారు. కెవిపి కాలనీ మెయిన్ రోడ్ నుండి గేలాక్సీ బార్ పక్కన రోడ్ లో మాస్టర్ ప్లాన్ మేరకు ప్రతిపాదించిన ఆర్డీపీకి ప్రభావిత భవన యజమానుల సమక్షంలో మార్కింగ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిటి ప్లానర్ ని ఆదేశించారు. సదరు ప్రాంతంలోని చంద్రభాను కుంట అభివృద్ధిలో భాగంగా ఫెన్సింగ్, కట్ట (బండ్), వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిఈఈని ఆదేశించారు. ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నందున ఆయా ప్లాట్ ల్లో గంబూషియా చేపలు వదలడం, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు. అనంతరం కొరెటెపాడులోని హిందూ శ్మశానవాటికను పరిశీలించారు.పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిప్యూటీ సిటి ప్లానర్ సూరజ్ కుమార్, ఈఈ విష్ణు, డిఈఈలు వెంకటరమణ, రమేష్ బాబు, ఎస్ఎస్ లు సోమశేఖర్, ఐజాక్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాలిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: గుంటూరులో వేగంగా రహదారుల విస్తరణ పనులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
74%
6 km/h
Mon
28 °C
Tue
30 °C
Wed
35 °C


