గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం బిఆర్ స్టేడియంలో పర్యటించి, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకొని, ప్రత్యక్ష్యంగా పరిశీలించి, మాట్లాడుతూ, బిఆర్ స్టేడియం పనుల వేగవంతంకు క్షేత్ర స్థాయిలో ఏ సమస్య లేనందున కాంట్రాక్టర్ తగిన కార్మికులు, సిబ్బందిని సిద్దం చేసుకొని వేగంగా చేయాలని, జిఎంసి నుండి పర్యవేక్షణకై ఈఈ, డిఈఈ, ఏఈలకు విధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులు నిర్దేశిత డిజైన్ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి అయ్యేలా డిఎస్డీఓ, జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేసి, తమకు నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించారు. పర్యటనలో డిఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్, జిఎంసి డిఈఈ శ్రీనివాస్, ఏఈ గౌస్, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
overcast clouds
30° _ 30°
68%
3 km/h
Wed
30 °C
Thu
33 °C
Fri
33 °C


