గుంటూరులో కమర్షియల్ వ్యర్థాల సేకరణ ఇక జీఎంసీ ఆధ్వర్యంలోనే | ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులు రద్దు

City News Telugu

ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులు పూర్తిగా రద్దు – యూజర్ ఫీజు చెల్లించవద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, జూలై 20: నగరంలో కమర్షియల్ వ్యర్థాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను పూర్తిస్థాయిలో రద్దు చేశామని, సోమవారం నుంచి ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.

గతంలో గుంటూరు నగరంలో వాణిజ్య వ్యర్థాలను ప్రైవేట్ ఏజెన్సీలైన క్యూబ్ ఎనర్జీ, రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు 14 వాహనాలు, 56 మంది కార్మికులతో సేకరించడంతో పాటు వ్యాపారుల నుంచి యూజర్ ఫీజు వసూలు చేసేవని తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య వ్యర్థాల సేకరణను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా నిర్వహిస్తోందని, ఇందుకు వ్యాపారులు ఎలాంటి యూజర్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.Reporter Dashboard

ఈ సేవల కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా 10 ట్రాక్టర్లు, 12 కాంపాక్టర్లు, 100 మంది పారిశుద్ధ్య కార్మికులను కేటాయించినట్లు తెలిపారు. నగరంలోని వ్యాపారులు గతంలో వ్యర్థాలను సేకరించిన ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులకు ఇకపై వ్యర్థాలను ఇవ్వవద్దని సూచించారు.Track Your Application Status

ఎవరైనా యూజర్ ఫీజు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా, వసూలు చేసేందుకు ప్రయత్నించినా వెంటనే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్ 0863-2345103కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు.

నగరంలోని అన్ని వ్యాపార సంస్థల యజమానులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకొని, తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా వర్గీకరించి కార్పొరేషన్ సిబ్బందికి అందజేయాలని కోరారు. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.Join Our News Team

Share This Article
Leave a review