Visakha City News :స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న “భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు

Sharat
1 View

విశాఖపట్నం: జూలై 30:- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న “భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలకు ముందు నిర్వహిస్తున్న ఈ 5కే రన్‌లో యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K కార్యక్రమం విజయవంతం అయ్యేలా శాప్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని, పాల్గొనేవారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Author
Share This Article
Leave a review