చిన్నగంజాం, ఆగస్టు 2 :-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన భీమవరపు అచ్చయ్య–మాధవి దంపతుల కుమారుడికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో వికలాంగ పింఛన్ మంజూరైంది. దాదాపు పదేళ్లుగా వికలాంగ పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పింఛన్ మంజూరు చేయించారు. సాధారణంగా పింఛన్ల పంపిణీ లేని సమయంలోనే ప్రత్యేక చర్యలు తీసుకుని పింఛన్ మంజూరు చేయించడం విశేషంగా నిలిచింది.
ఆదివారం గొనసపూడి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో లబ్ధిదారుడికి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే చొరవను అభినందించారు.



