GUNTUR DISTRICT NEWS: రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోయింది

Karthik

కరువు పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రకృతి విపత్తుగా ప్రకటించి, రైతుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తపేట సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో పంటలు వేయలేని స్థితిలో అన్నదాతలు ఉంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోయింది. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోందని పేర్కొన్నారు.పోరాటాలు చేసే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. మంత్రి నారా లోకేష్ టీచర్ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో అమ్ముకోవడం స్పష్టమైంది.పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిస్తామని అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review