GUNTUR CITY NEWS: వైభవంగా శ్రీ సిద్ది బుద్ధి సమేత శ్రీ వినాయక దివ్య కళ్యాణ మహోత్సవం

Karthik

వినాయక చవితి ఉత్సవాలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాం నగర్ లో సోము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ సిద్ది బుద్ధి సమేత శ్రీ వినాయక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణ నడుమ వీనుల విందుగా కళ్యాణ మహోత్సవం సాగింది. స్థానిక భక్తులు దైవ దర్శనం గావించి, కన్నులారా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి వేడుకల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.

Author
Share This Article
Leave a review