గుంటూరు నగర మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం సాధించడంతో నగర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆమె విజయానికి సంబంధించిన అంశాల్లో సినీ నటుడు జగపతిబాబు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికలకు ముందు తన చెల్లెలు కోవెలమూడి లక్ష్మీ అపర్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగపతిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గుంటూరు మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ అపర్ణకు ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీడియోలో విజ్ఞప్తి చేశారు. గతంలో కూటమిపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన ప్రజలు, అదే ఆదరణను మరోసారి చూపించి లక్ష్మీ అపర్ణతో పాటు కూటమి తరఫున పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.గుంటూరు కార్పొరేషన్‌లో కూటమి హవాగుంటూరు నగరపాలక సంస్థలో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 76 డివిజన్లు ఉండగా, కూటమి అభ్యర్థులు 64 డివిజన్లలో విజయం సాధించినట్లు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 48 స్థానాలు, జనసేన పార్టీ 13 స్థానాలు, భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 డివిజన్లలో విజయం సాధించారు.భార్య తర్వాత భర్త.. ఒకే మేయర్ కుర్చీలో ఇద్దరూ!లక్ష్మీ అపర్ణ విజయంతో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆమె భర్త కోవెలమూడి రవీంద్ర గతంలో పది నెలలపాటు గుంటూరు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు అదే మేయర్ పదవిని ఆయన భార్య లక్ష్మీ అపర్ణ చేపట్టబోతున్నారు.ఒకే క్యాలెండర్ సంవత్సరంలో భార్యాభర్తలిద్దరూ వరుసగా గుంటూరు నగర ప్రథమ పౌరులుగా ఒకే మేయర్ కుర్చీని అధిరోహించనుండటం రాజకీయంగా ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. జగపతిబాబు విడుదల చేసిన వీడియో వైరల్ కావడం, మరోవైపు లక్ష్మీ అపర్ణ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గుంటూరు రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.



