గుంటూరు నగరంలోని ప్రధాన డ్రైన్స్ లో రెండవ విడత సిల్ట్ తొలగింపు పనులు శనివారం లోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పూడికతీత కాంట్రాక్ట్ నిర్వహణ 90 రోజులు పాటు సదరు కాంట్రాక్టర్ దే భాధ్యత ఉండేలా నిబందనలు పొందుపరిచినందున వారితోనే రెండో విడత పూడికతీత పనులను శనివారం లోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కల్వర్ట్ లు ఉన్న ప్రాంతాలలో సరిగా సిల్ట్ తొలగించుట లేదని పిర్యాదులు అందుతున్నాయని, వాటి పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, కాలువల్లో తీసిన సిల్ట్ ను వెంటనే సదరు ప్రాంతం నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఉన్న పాట్ హొల్స్ కు రానున్న వారం రోజుల్లో మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా కూడా పాట్ హోల్స్ కనబడకూడదని, ఏ.ఈ లు క్షేత్ర స్తాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా ఏ.ఈ లు వారి పరిధిలో త్రాగునీటి సరఫరా పై ద్రుష్టి సారించాలని, ఎక్కడా కలుషిత నీరు సరఫరా జరగకుండా వారి పరిధిలోని ఈ.యల్.యస్.ఆర్ లలో మరియు గృహాల వద్ద నీటి శాంపిల్స్ విధిగా నూరు శాతం సేకరించాలని ఆదేశించారు. ఈ.యల్.యస్.ఆర్ లను నిర్దేశిత సమయానికి శుభ్రం చేయించాలని, అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అలాగే వాటర్ మీటర్ రీడింగ్ తప్పకుండా తీయాలని, అవసరమైన ప్రాంతాలలో నూతన మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏఈ లను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియ పూర్తైనా పనులు ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని, అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఏ.ఈలు ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించాలన్నారు. నగరంలోని పార్కులు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, 15వ ఆర్ధిక సంఘ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నగరంలో నూరు శాతం స్ట్రీట్ లైటింగ్ వెలగాలని, అవసరమైన ప్రాంతాలలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల నుండి అందే పిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, సమస్య పరిష్కరించే ముందు తరువాత ఫోటోలను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో యస్.ఈ (ఇంచార్జ్) సుందర్రామి రెడ్డి, ఈఈ విష్ణు మూర్తి, డి.ఈ.ఈ లు, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: సిల్ట్ తొలగింపు పనులు శనివారం లోపు పూర్తి చేయాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
overcast clouds
32° _ 32°
61%
2 km/h
Tue
31 °C
Wed
34 °C
Thu
34 °C


