మార్కాపురం:-‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు మంజూరు చేయలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అనుమతులు లేని ఇటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు ఎవరూ పాల్గొనవద్దని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు లేదా నిరసన కార్యక్రమాలు నిర్వహించినా చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుMarkapur district news :సుందరయ్య కాలనీలో అభివృద్ధి శూన్యం.
సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ చట్టాన్ని గౌరవించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా విజ్ఞప్తి చేశారు.



