Markapur district news :సుందరయ్య కాలనీలో అభివృద్ధి శూన్యం

Sharat
10 Views

మార్కాపురం, సెప్టెంబర్ 26:-మార్కాపురం పట్టణంలోని 3వ వార్డు పరిధిలో ఉన్న సుందరయ్య కాలనీలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి సుందరయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి, అక్కడ నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాలనీ ఏర్పడి 22 ఏళ్లు దాటుతున్నా నేటికీ కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. కాలనీలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు పాఠశాల భవనం లేక స్థానికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Prakasam district news

కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ మౌలిక సమస్యలపై త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఒకవేళ స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ వలి, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review