GUNTUR CITY NEWS: కార్మికులకు అండగా నగరపాలక సంస్థ

Karthik

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల ఔట్సొర్సింగ్ కార్మికులు బి.జగన్నాయక్ (రూ.5.15లక్షలు) , యస్.ప్రసాద్ (రూ.2లక్షలు), సి.హెచ్ కోటేశ్వర రావు (రూ. 5లక్షలు), యం.ఆంటోనీ (రూ.2.15లక్షలు) ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా కి సంబంధించిన డి.డి లను మంగళవారం కమిషనర్ చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగర పాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబాలకు నగర పాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలను, ఇన్సురెన్స్ పాలసీలకు సంబంధించి పరిశీలించి త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు.

Author
Share This Article
Leave a review