Vijayawada city News :విజయవాడలో వైభవంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్-క్రీడాకారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు

Sharat
1 View

విజయవాడ (ఆగస్టు 06):– ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌లో ప్రతిభ చాటి, క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

స్థానిక వి.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అండర్-21 & ఓపెన్ కేటగిరీ వాలీబాల్ సెలెక్షన్ ట్రయల్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ లీగ్ ట్రయల్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన యవ క్రీడాకారులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ప్రతి క్రీడాకారుడూ ఈ సవర్ణావకాశాన్ని అందిపుచ్చుకుని, తమ నైపుణ్యంతో ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో చోటు సాధించి దేశస్థాయిలో రాణించాలి” అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ, బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ తో పాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review