చిన్నగంజాం, ఆగస్టు 6 :– బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం కొత్తపాలెంలో సుమారు రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన 33 కేవీ అత్యవసర విద్యుత్ లైన్ ఫీడర్‌ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 33 కేవీ ఫీడర్ ద్వారా చిన్నగంజాం మండల ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందే అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంలో ఈ ఫీడర్ కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



