Vijayawada Local News :విజయవాడలో ‘పవర్’ చిత్రం ఘనంగా ప్రారంభం-క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

Sharat
1 View

విజయవాడ :– విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణం గురువారం ఒక కొత్త సినిమా ముహూర్త వేడుకకు వేదికైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న “పవర్” చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ… పరిమిత బడ్జెట్‌తో, నూతన ఆలోచనలు, సరికొత్త కథాంశంతో వస్తున్న ‘పవర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. పరిశ్రమలోకి వస్తున్న కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ చిత్రయూనిట్‌కు తన ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో పలువురు స్థానిక ప్రముఖులు, చిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review