Vijayawada City news :ప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు

Sharat
1 View

విజయవాడ పశ్చిమ:– ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం చిట్టినగర్ సర్కిల్-1 కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్‌లో 157 మందికి వైద్య సేవలు అందించారు.

పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చిట్టినగర్‌లో జరిగిన వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ సేవలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అమరావతి ఐ హాస్పిటల్, ప్రభుత్వ డెంటల్ వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు వైద్య సేవలు అందించారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రం కొండ, మాజీ కార్పొరేటర్ నాగోతి రామారావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలివాడ పట్నాయక్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు వెంపలి గౌరీ శంకర్, మాజీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిని, పోతినేడి లోకేష్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు పగిడిపల్లి ప్రభు చరణ్, పాలవై దాసు, పైలా నరసింహారావు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొని సేవలందించారు

Author
Share This Article
Leave a review