స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని, అరాచకం సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్న వైసీపీ ఆటలు సాగవమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ క్యాలెండర్ సమావేశంలో భాగంగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ నేతల గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…* స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో జరగనున్న నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఆటలు సాగవని అన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా విజయవాడలో ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం చేపట్టిన దమనకాండను ఖండిస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి.. వైసీపీ ఆటలు సాగవు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
overcast clouds
25° _ 25°
95%
5 km/h
Wed
25 °C
Thu
25 °C
Fri
27 °C


