Palnadu distric News :శిలాఫలకంపై ఫోటో తొలగింపు ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Sharat
1 View

పల్నాడు జిల్లా, రెంటచింతల, ఆగస్టు 7 :– పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యా కమిటీ చైర్మన్ దావులూరి రాజేష్ ఫోటోను శిలాఫలకంపై తొలగించిన ఘటనపై ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దావులూరి రాజేష్ ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఉద్దేశపూర్వకంగా ఆయన ఫోటోను శిలాఫలకంపై నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ ఘటన తమ కుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత కాంట్రాక్టర్ స్వామిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు బాధ్యులైన అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని దావులూరి రాజేష్‌కు న్యాయం చేయాలని కోరారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రజల్లోకి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా అందరూ షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జై భీమ్ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, పట్రా ప్రభుదాస్, గంటల అశోక్, పప్పుల రవీంద్ర, బండ్ల ప్రభుదాస్, పట్రా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగింపులో “జై భీమ్ – జై అంబేద్కర్” నినాదాలు చేశారు.

Author
Share This Article
Leave a review