Guntur District news :వీఆర్ఏలకు ప్రమోషన్లలో న్యాయం చేయాలి- కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన సీఐటీయూ

Sharat
1 View

గుంటూరు :– ఉత్తర్వుల ప్రకారం అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) వీఆర్వో గ్రేడ్-2గా వెంటనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (59/86) – సీఐటీయూ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని (గుంటూరు, బాపట్ల, పల్నాడు) ఖాళీల వివరాలను సమగ్రంగా పరిశీలించి, వీఆర్ఏల ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 95 గ్రేడ్-1, 99 గ్రేడ్-2 వీఆర్వో పోస్టులు కలిపి మొత్తం 194 ఖాళీలు ఉన్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న గ్రేడ్-2 వీఆర్వో ఖాళీలతో పాటు, గ్రేడ్-1 వీఆర్వోలు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లపై వెళ్లడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఖాళీలపై ఖచ్చితమైన సమాచారాన్ని సీసీఎల్ఏ (CCLA)కు పంపి, అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.Guntur City news

కలెక్టర్‌ను కలిసిన వారిలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్, సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా నాయకులు జాలా రాజేష్, రత్నరాజు, రవి, దేవి, ముస్కాన్, బాబు తదితరులు ఉన్నారు.

Author
Share This Article
Leave a review