దర్శి (ప్రకాశం జిల్లా):– ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా నరహరి నాగ మల్లేశ్వరరావు శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తామని, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని వెల్లడించారు.Prakasam district news
అనంతరం సర్కిల్ కార్యాలయ సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.



