Gudivada City news :గుడివాడలో బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె-5 డేస్ బ్యాంకింగ్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్

Sharat
1 View

గుడివాడ, సెప్టెంబరు 11:– యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు గుడివాడలో నిర్వహించిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతంగా జరిగింది. గుడివాడ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సమ్మెలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత, అధిక టార్గెట్లు, క్రాస్ సెల్లింగ్, రికవరీతో పాటు అదనపు పనిభారాన్ని తగ్గించాలని కోరారు. ఉద్యోగుల పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోసం 5 డేస్ బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన PLIతో పాటు ఇతర సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని నాయకులు కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.NBK 112 Movie: బాలయ్య-కొరటాల శివ కాంబోలో 1 పవర్ ఫుల్ మాస్ ఆరంభం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ అప్డేట్!

గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శి అభయ ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మల్లికార్జున్ (బ్యాంక్ ఆఫ్ ఇండియా), రత్నాకర్ (ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్), పి.వి.రావు (ఇండియన్ బ్యాంక్), భాను ప్రసాద్ (కేవీబీ), శ్రీనివాస శ్రావణ్, ఏవి రమణ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review