Palnadu District news :స్థానిక ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కసరత్తు-పల్నాడు జిల్లా స్థాయిలో తొలి సమావేశం

Sharat
1 View

నరసరావుపేట, సెప్టెంబరు 12:– త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పల్నాడు జిల్లా స్థాయి సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధిష్టానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.

టీడీపీ నుంచి పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ జాన్ సైదా, టీడీపీ ఎన్నికల కో-కన్వీనర్ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు.

జనసేన పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలాని, పార్టీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ పగడాల శివపార్వతి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ, ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ హాజరయ్యారు.

బీజేపీ నుంచి పల్నాడు జిల్లా అధ్యక్షుడు వైవీఎం శశికుమార్, రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అలోకం సుధాకర్ పాల్గొన్నారు.Palnadu Revenue Department: రెవెన్యూ సేవలపై CCLA సమగ్ర సమీక్ష.. ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ కీలక ఆదేశాలు!

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకులు, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగేందుకు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

– రిపోర్టర్ శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా నరసరావుపేట

Author
Share This Article
Leave a review