హైదరాబాద్: దేవునికి, మానవాళికి అంకితభావంతో సేవలందిస్తున్న వ్యక్తులను గౌరవించే ఉద్దేశంతో పద్మచక్ర జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్‌లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఉషా రాణి మెమోరియల్ ట్రస్ట్, బీకే ఆధ్యాత్మిక వైద్యురాలు రాధిక లెల్లా, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్‌ల సహకారంతో ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.
దేవుని సేవతో పాటు మానవాళికి అంకితభావంతో సేవ చేస్తున్న మొత్తం 19 మంది దైవ ఆత్మలను పద్మచక్ర జాతీయ పురస్కారాలతో సత్కరించారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత, మానవతా విలువలకు కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.#KarumuriNageswaraRao #SITRaids #AndhraPradeshNews #YCP #LiquorScam #Hyderabad #JubileeHills #APPolitics #Vijayawada #BreakingNews
పురస్కారాల ప్రదానోత్సవంలో నిర్వాహకులు, ఆహ్వానితులు, పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభించడం పట్ల పురస్కార గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.



