Eluru District news :పోలవరం ప్రాజెక్ట్ వద్ద మోదీ జన్మదిన వేడుకలు-ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు

Sharat
1 View

పోలవరం, సెప్టెంబర్ 17:– ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రంతో పాటు దేశానికి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

గత పాలకుల హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదా అనే సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.Eluru City News

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణతో పోలవరం పనుల్లో వేగం పెరిగిందని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రార్థించినట్లు చెప్పారు. ఆయన నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు.

Author
Share This Article
Leave a review